ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఇంటివద్ద నుంచి ఒక్కఫోన్ చేస్తేచాలు పరిష్కరించి వారంరోజుల్లో సమాచా రం ఇస్తామని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఇంటివద్ద నుంచి ఒక్కఫోన్ చేస్తేచాలు పరిష్కరించి వారంరోజుల్లో సమాచా రం ఇస్తామని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పేర్కొన్నారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి ముందు పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాకేంద్రానికి రాలేనివారు ఒక్కఫోన్‌చేస్తే చాలన్నారు. వీటికోసం ప్రత్యేకంగా సెల్ నెం.9866098111ను కేటాయించినట్లు చెప్పారు. అనంతరం ‘ఫోన్‌ఇన్’ కార్యక్రమంలో మాట్లాడారు. జేసీ ఎల్ శర్మన్ ఐదుగురి ఫిర్యాదులను స్వీకరించారు. సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో 38 ఫిర్యాదులు నమోదయ్యాయి.