కోవిడ్‌ కారాగారంగా పీలేరు సబ్‌జైల్‌

Peeleru Subjail As Covid 19 Prison For Effected Prisoners in Chittoor - Sakshi

ఆరుగురు ఖైదీలకు పాజిటివ్‌

పీలేరు రూరల్‌ : పీలేరు సబ్‌జైల్‌ను కోవిడ్‌ కారాగారంగా మార్చినట్లు జిల్లా జైళ్లశాఖ అధికారి హుస్సేన్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన పీలేరు సబ్‌జైల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హుస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పలు జైళ్ల నుంచి 138 మంది ఖైదీలను ఇక్కడకు తరలించామన్నారు. వీరిలో ఇప్పటి వరకు 83 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. నెగటివ్‌ వచ్చినవారిలో 50మందిని మదనపల్లెకు, 15మందిని చిత్తూరుకు, నలుగురిని సత్యవేడుకు, ఏడుగురిని తిరుపతి జైళ్లకు తరలించామని వివరించారు. మిగిలిన ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సబ్‌జైల్‌ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో జైలర్‌ ఫణికుమార్, సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top