రాష్ట్ర విభజనను నిరసిస్తూ అమెరికాలోని తెలుగు వారు, యువకులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.
విభజనపై అమెరికాలో నిరసన
Sep 29 2013 3:18 AM | Updated on Apr 4 2019 3:25 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ అమెరికాలోని తెలుగు వారు, యువకులు నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాలిఫోర్నియాలో స్థిరపడిన కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తెలుగువారు ఒక చోటకు చేరి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ విషయం కొమ్మినేని ‘న్యూస్‌లైన్’కు ఫోన్‌లో తెలిపారు. సీమాంధ్రలో 60 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచకపోగా, వారికి అందుబాటులో లేకుండా తప్పించుకు తిరగడం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే కాంక్షతో సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పూనుకుందని, తెలంగాణ దుష్టశక్తులతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నారైలు దాచర్ల అశోక్, చలసాని అనిల్, మందడపు పుల్లారావు, కొడాలి వెంకట్, చుండు పవన్, బి.శ్రీకాంత్, ఎం.సివేశ్, ఎం.విద్యాసాగర్, ఎన్.కిరణ్, డి.బాలాజీ, జి. కళ్యాణ్, శివ, నగేష్, రణధీర్, వి.రవి, కె. మహేంద్ర, విద్య, జనార్ధన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement