'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా' | Palle Raghunatha Reddy visits kanakadurga Temple in Vijayawada | Sakshi
Sakshi News home page

'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'

Sep 27 2014 10:35 AM | Updated on Jul 29 2019 6:03 PM

'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా' - Sakshi

'రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని ప్రార్థించా'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వవైభవం రావాలని కనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. దసరా పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తామని చెప్పారు. శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గమల్లేశ్వరస్వామివారిని పల్లె రఘునాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు పల్లె రఘునాథ్రెడ్డికి ఆలయ అధికారులు  స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శరన్న నవరాత్రులు సందర్బంగా ఇంద్రకీలాద్రిపై భక్త జనం పోటెత్తింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement