తెలంగాణ వస్తేనే బతుకు | our life is depend on telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణ వస్తేనే బతుకు

Aug 13 2013 7:30 AM | Updated on Sep 1 2017 9:49 PM

తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆ ప్రాంత ప్రజల బతుకులు మారతాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సింగపూర్‌లో తెలంగాణవాసులు ఏర్పాటు చేసిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సమావేశంలో మాట్లాడారు.


 రాయికల్/రామడుగు, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆ ప్రాంత ప్రజల బతుకులు మారతాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సింగపూర్‌లో తెలంగాణవాసులు ఏర్పాటు చేసిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పోరాటం, అమరుల త్యాగ ఫలితంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల బతుకులు మారతాయని చెప్పారు. అప్పుడు ప్రజలు సింగపూర్, దుబాయ్, మస్కట్ తదితర దేశాలకు వెళ్లనవసరం లేదన్నారు.
 
 సోనియాగాంధీ  రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేశారని, సీమాంధ్ర నాయకులు ఎన్ని పన్నాగాలు పన్నినా తెలంగాణ ఏర్పాటు ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసే బాధ్యత తెలంగాణ ఎంపీలపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, కళాకారుడు గోరేటి వెంకన్న, రసమయి బాలకిషన్, గంగ, మిమిక్రీ కళాకారుడు శ్రీనివాస్, భిక్షునాయక్, బండ మాధవరెడ్డి, మహేందర్, చంద్రశేఖర్‌రెడ్డి, గంగుల భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్, వినోద్‌రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement