మితిమీరిన వేగంతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది.
టంగుటూరు (ప్రకాశం జిల్లా) : మితిమీరిన వేగంతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కేంద్రంలోని టోల్‌ఫ్లాజా వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. నాయుడుపేటకు చెందిన కొంత మంది మూడు టాటా మ్యాజిక్ వాహనాల్లో పుష్కరాలకు బయలుదేరారు.
అయితే రెండు వాహనాలు వెళ్లిపోగా, మూడవ వాహనం టంగుటూరు టోల్‌ఫ్లాజా ఫ్లై ఓవర్ దగ్గర ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ మహ్మద్ రాజా అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.