బస్సు ఎక్కబోతూ..జారిపడి వృద్ధురాలు మృతి | Old woman died trying to take the bus | Sakshi
Sakshi News home page

బస్సు ఎక్కబోతూ..జారిపడి వృద్ధురాలు మృతి

Sep 19 2015 2:10 PM | Updated on Sep 2 2018 4:48 PM

బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.  శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం నౌతాల గ్రామం సమీపంలో రుగడకొమానపల్లి గ్రామానికి చెందిన గంటా అన్నమ్మ(70) ఆర్టీసీ బస్సు ముందు డోర్ తీసుకుని ఎక్కబోయింది. అయితే, డ్రైవర్ ఇది గమనించక బస్సును ముందుకు కదిలించడంతో.. జారి వెనక చక్రాల కింద పడి మృతి చెందింది. నౌతాల గ్రామం నుంచి స్వగ్రామానికి వెళ్లబోయే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెకు ఏడుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement