సీతంపేట ఐటీడీఏలో జవాబుదారీ తనం కొరవడిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని జీరో అవర్‌లో నిలదీశారు.
కీలకమైన పోస్టుల్లో ఇన్‌చార్జిలేనా?
కొరవడిన జవాబుదారీ తనం
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని
నిలదీసిన ఎమ్మెల్యే కళావతి
సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో జవాబుదారీ తనం కొరవడిందని పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని జీరో అవర్‌లో నిలదీశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సీతంపేట ఐటీడీఏలో ముఖ్యమైన పోస్టుల్లో ఇన్‌చార్జిలు కొనసాగడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజన సంక్షేమ శాఖలో డిప్యూటీ డెరైక్టర్ పోస్టును డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు ఎలా కట్టబెట్టారని నిలదీశారు. ఆయనకు ఏటీడ బ్ల్యూవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారని తెలిపారు. ఐటీడీఏ మేనేజరుకు పరిపాలనాధికారిగా పదోన్నతి కల్పించి ఏడేళ్లుగా అక్క డే కొనసాగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఐటీడీఏ ఉద్యోగులకు బదిలీలు ఉండావా? అని ప్రశ్నించారు.
హౌసింగ్, ఎస్‌ఎంఐ వం టి శాఖల్లో అక్రమాలు పేరుకుపోయినట్టు గతంలో మంత్రు ల వద్ద ప్రస్తావించినా... పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింత లు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా? లేదా అనే విషయమై ఆయా మంత్రులు ఏనాడైనా ఆరా తీశారని ప్రశ్నించారు. అప్‌గ్రేడ్ చేసిన ఆశ్రమ పాఠశాలలకు సిబ్బందిని నియమించాలని, గిరిజన గురుకుల కళాశాలల్లో సీఈసీ గ్రూపులు ఏర్పాటు చేసి సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు.