సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్ | No guarantee on united Andhra Pradesh: Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్

Oct 17 2013 5:25 PM | Updated on Jul 29 2019 5:31 PM

సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్ - Sakshi

సమైక్యతపై చేతులెత్తేసిన సీఎం కిరణ్

సమైక్యతపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు.

హైదరాబాద్: సమైక్యతపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. ఏపీ ఎన్జీఓ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని ముఖ్యమంత్రి వారికి చెప్పారు. తన చేతిలో ఏమీలేదని,  కేంద్రం తరపున ఎటువంటి హామీ ఇవ్వలేనని చెప్పారు.  ఆర్టికల్ 371(డి)పై కేంద్రంతో మాట్లాడతానన్నారు. 2014 వరకు రాష్ట్రం విడిపోదని చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై జీఓఎంను కలవండని చెప్పారు. విభజనను అడ్డుకునే ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నానన్నారు.  సమ్మె విరమించాలని కోరారు. తాను కూడా మీతో కలిసి ఉద్యమం చేస్తానని చెప్పారు.

ముఖ్యమంత్రితో చర్చలు ముగిసిన అనంతరం  ఏపీఎన్జీఓ నేతలు  అంతర్గతంగా సమావేశమయ్యారు. కొందరు సమ్మె విరమించడానికి సంసిద్ధత తెలుపుతుంటే, మరికొందరు సమ్మె కొనసాగించాలని అంటున్నారు. సమావేశం ముగిసిన తరువాత వారు తమ నిర్ణయం ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement