బెజవాడ కేంద్రంగా కొత్త జిల్లా? | new district to be formed as Vijayawada center ? | Sakshi
Sakshi News home page

బెజవాడ కేంద్రంగా కొత్త జిల్లా?

Jan 1 2015 2:25 AM | Updated on Sep 2 2017 7:02 PM

కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలను కలిపి విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు మండలాలను కలిపి విజయవాడ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఆర్‌డీఏ పరిధిని ప్రకటిస్తూ  గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో రెండు జిల్లాల్లోని ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు సూచించినట్లు  సమాచారం. సీఆర్‌డీఏ పరిధిలోని 58 మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement