నవ నిర్మాణ దీక్ష పూర్తిగా విఫలం | Navnirman Initiation Failure | Sakshi
Sakshi News home page

నవ నిర్మాణ దీక్ష పూర్తిగా విఫలం

Published Sun, Jun 5 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు

గరివిడి: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) విమర్శించారు. గరివిడి పట్టణంలో వైఎస్సార్‌సీపీ కార్యాల యంలో శనివారం ఆయన విలేకరుల  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాధికారులను నిర్బంధించి దీక్షలు చేయిస్తున్నారని  ఆరోపించారు.  అంతేగానీ ప్రజలు మాత్రం దీక్షలో  స్వచ్ఛందంగా పాల్గొనడం లేదన్నారు.
 
  టీడీపీ పాలపై ప్రజలంతా అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు పనితీరుపై ప్రజలు మండిపతున్నారని వ్యాఖ్యానించారు.   సాక్షాత్తూ గృహనిర్మాణ శాఖ మంత్రి ఉన్న చీపురుపల్లి నియోజకవర్గంలో పేదవారికి ఇంత వరకూ ఒక్క ఇళ్లు కూడా కట్టించలేకపోవడం ఘోరమన్నారు. ప్రజలంతా ఈ విషయాలన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు.
 
 సీఎం చంద్రబాబు చీపురుపల్లికి వచ్చినప్పుడు గరివిడిలో వెటర్నరీ కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఫేకర్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు.  అయితే బాబు ఇచ్చిన హామీలన్నీ అప్పుడే మరిచారని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల స్థాయి నాయకులు, మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణంనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వర్రావు, పొన్నాడ వెంకటరమణ, ముల్లు రాంబాబు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు యడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ,ఎలకల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement