నారాయణ విద్యాసంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
నారయణ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
Mar 27 2017 7:03 PM | Updated on Nov 9 2018 5:02 PM
తిరుపతి: నారాయణ విద్యాసంస్థలో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతి నారయణ స్కూల్లో పదో తరగతి చదువుతున్న వాసు మొదటి అంతస్థుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే పాఠశాల సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి వాసుకి తీవ్ర గాయలయ్యాయి.
ఇదే విద్యాసంస్థలో పది రోజుల క్రితమే పదో తరగతి విద్యార్థి సాయిచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మరవక ముందే మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో తొటి విద్యార్థులకు, తల్లితండ్రులకు ఆందోళన నెలకొంది. అయితే వాసు తల్లితండ్రులు మాత్రం సిబ్బంది వేధింపులే తమ కొడుకు ఆత్మహత్యయత్నానికి కారణమని ఆరోపించారు.
Advertisement
Advertisement