
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలతో సుభిక్ష పాలన అందిస్తున్నారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. విజయవాడలో ఆదివారం జరిగిన ఏపీ రాష్ట్ర చాత్తద శ్రీ వైష్ణవ సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఐక్యమత్యం, అనుబంధంతో కార్తీక మహోత్సవం నిర్వహించడం శుభపరిణామన్నారు. పెద్దల సిద్ధాంతాలను కాపాడుకోవాలని లక్ష్మీపార్వతి పిలుపునిచ్చారు. రామానుజచార్యులు అష్టాక్షరీ మంత్రం అందరికీ అందించారన్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, 13 జిల్లాల చాత్తాద శ్రీ వైష్ణవుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.