కేసీఆర్... చేతికి వచ్చిన పంట నీదంటావా | Nagam Janardhan Reddy takes on TRS President K Chandrasekhar Rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్... చేతికి వచ్చిన పంట నీదంటావా

Mar 7 2014 3:07 PM | Updated on Mar 29 2019 9:18 PM

కేసీఆర్... చేతికి వచ్చిన పంట నీదంటావా - Sakshi

కేసీఆర్... చేతికి వచ్చిన పంట నీదంటావా

తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని నీ పదవుల కోసం వాడుకుంటున్నావంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు.

తెలంగాణ తల్లుల గర్భశోకాన్ని నీ పదవుల కోసం వాడుకుంటున్నావంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం నాగం జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంతా తన వల్లే వచ్చిందని కేసీఆర్ ప్రచారం చేయడం పట్ల నాగం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అరుగాలం కష్టపడిన వారిని వదిలేసి చేతికి వచ్చిన పంటను చూపించి అంతా తన కృషి ఫలితమే అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని  ఆయన ఎద్దేవా చేశారు.

 

తెలంగాణ సాధించే క్రమంలో రాజకీయ ప్రక్రియలో నీ భాగస్వామ్యం ఎంత అంటూ కేసీఆర్ను నాగం ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ అక్కడ లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటు కేసీఆర్పై ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు.  మహబూబ్నగర్ ఎంపీగా ప్రజలుకు ఏం చేశావంటు కేసీఆర్పై నాగం ఎదురు దాడికి దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement