రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజలకు మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ కంపెనీ 240 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది.
కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా అమాయక ప్రజలకు మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ కంపెనీ 240 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టింది. మైత్రి ఫైనాన్స్గా అందరికీ తెలిసిన ఈ సంస్థపై ఎమ్మిగనూరుకు చెందిన ఖాసిం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సంస్థ చైర్మన్ లక్కు మాధవరెడ్డి, డైరెక్టర్లు చంద్రా రెడ్డి, మాల్యాద్రి రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కర్నూలు సబ్‌జైలుకు తరలించారు.
ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వీరిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి బాధితులు నిన్న ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయవద్దని బాధితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు, బాధితులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
వారిని అరెస్ట్ చేస్తే జైలుకు వెళతారు తప్ప తమకు న్యాయం జరగదని బాధితులు గగ్గోలు పెట్టారు.