పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా... | mother leaves baby in hospital due to financial problems | Sakshi
Sakshi News home page

పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా...

Mar 12 2015 3:39 PM | Updated on Sep 2 2017 10:43 PM

పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా...

పోషించలేకనే నా బిడ్డను వదిలివెళ్తున్నా...

చిత్తూరు జిల్లా తిరుపతి స్విమ్స్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ తల్లి తన మూడునెలల శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది.

తిరుపతి :చిత్తూరు జిల్లాలోని తిరుపతి స్విమ్స్‌లోని ఆయుర్వేద ఆస్పత్రిలో బుధవారం రాత్రి ఓ తల్లి తన మూడునెలల శిశువును వదిలి వెళ్లిపోయిన ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున గమనించిన ఆస్పత్రి సిబ్బంది శిశువును స్థానిక పోలీసులకు అప్పగించారు. అయితే  శిశువు తల్లిదండ్రులు, ఇతర పూర్తి వివరాలు, ఆస్పత్రి రికార్డులు కూడా అక్కడే వదిలి వెళ్లడంతో ఆమె నెల్లూరు జిల్లా వాసిగా భావిస్తున్నారు.

 

తాను నయం కాని వ్యాధితో బాధపడుతున్నానని,  పోషించే స్థోమత లేక తన కూతురుని వదిలివెళ్తున్నట్లుగా ఆమె రాసిన ఉత్తరంలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement