స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు | More powers to For Mandalas and Zilla Parishads along with Village Panchayats | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు

Jan 30 2020 3:46 AM | Updated on Jan 30 2020 3:46 AM

More powers to For Mandalas and Zilla Parishads along with Village Panchayats - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అమలవుతున్న 1994 నాటి పంచాయతీరాజ్‌ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నేతృత్వంలో.. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీరాజ్‌ శాఖ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు అధికారుల బృందం కొత్త చట్టం ముసాయిదా తయారీ పనిలో ఉంది.

ఈ బృందం వివిధ జిల్లాల్లో పనిచేసే పంచాయతీరాజ్‌ శాఖ సీనియర్‌ అధికారులతో కలిసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ముసాయిదా చట్టం రూపకల్పనపై కమిషనర్‌ కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించింది. 15–20 రోజులలో కొత్త చట్టం ముసాయిదా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్టు బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement