అప్పు తీర్చలేదని.. | Moneylenders harassments in guntur district | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చలేదని..

Apr 20 2016 1:34 PM | Updated on Sep 26 2018 6:15 PM

రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తీసుకున్న అప్పు చెల్లించక పోతే ఏమీ చేసేందుకైనా వెనుకాడటం లేదు.

నరసరావుపేట : రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తీసుకున్న అప్పు చెల్లించక పోతే ఏమీ చేసేందుకైనా వెనుకాడటం లేదు. తాజాగా అప్పు చెల్లించలేదని వడ్డీప్యాపారి ఓ వ్యక్తిని నిర్బంధించాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి బాదితుడిని విడిపించి వడ్డీ వ్యాపారిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం చెల్లారివారిపాళెంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు... కుంభా వెంకట్రావు అనే వ్యక్తి ముష్టిపల్లి కొండలు అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాడు.

అప్పు తీర్చలేదన్న ఆగ్రహంతో సదరు వడ్డీవ్యాపారి వెంకట్రావును మంగళవారం ఉదయం ఇంటికి పిలిపించి గదిలో నిర్భంధించాడు. విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, తల్లి బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు వ్యాపారి ఇంట్లో బంధీగా ఉన్న వెంకట్రావును విడిపించి కొండలును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement