breaking news
kondal
-
'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ)
నడి సముద్రంలో ఓ బోటు. అందులోనే రెండున్నర గంటల సినిమా అంటే.. హా ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ 'కొండల్' అనే డబ్బింగ్ బొమ్మ నిజంగానే ఆశ్చర్యపరిచింది. చూస్తున్నంతసేపు సముద్రం మధ్యలో బోటులో ఉన్నామా అనేంతలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?'కొండల్' కథ విషయానికొస్తే.. అదో సముద్ర తీర ప్రాంతం. ఎందరో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లలో ఒకడే ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్). ఎలాంటి వాడితోనైనా సరే ఢీ కొట్టే రకం. ఓసారి కొత్త బృందంతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు. తమ బోటులోకి కొత్తగా వచ్చిన ఇతడిపై జూడ్ (షబీర్) గ్యాంగ్ కన్నేసి ఉంచుతారు. కొన్నిరోజులకు ఇమ్మాన్యుయేల్ గురించి ఓ సీక్రెట్ తెలుస్తుంది. కాదు కాదు అతడే చెబుతాడు. దీంతో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు? ఇమ్మాన్యుయేల్ ఎవరు? డేనియల్ అనే వ్యక్తితో ఇతడికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'కొండల్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో రివేంజ్ స్టోరీతో తీసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. రెండున్నర గంటల సినిమాలో దాదాపు రెండు గంటల పాటు కథంతా సముద్రం మధ్యలో ఓ బోటులోనే ఉంటుంది. అసలు బోటులో ఏం స్టోరీ చెప్పగలరు? మహా అయితే ఏం చూపిస్తారులే అని మనం అనుకుంటే పప్పులే కాలేసినట్లే.మత్స్యకారులు జీవితాలు ఎలా ఉంటాయి? రోజుల తరబడి వేటకు వెళ్లిన వాళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు? ఒకవేళ వేటకు వెళ్లిన వాళ్లలో గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాలని చాలా నేచురల్‌గా చూపించారు. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటాయి. మరోవైపు రివేంజ్ డ్రామా నడిపిన విధానం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా స్టోరీ సెటప్ కోసం వాడుకోగా.. ఇంటర్వెల్‌కి హీరో గురించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో vs విలన్ అన్నట్లు సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్‌లో షార్క్ ఫైట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంకా చెప్పాలంటే షార్క్ ఫైట్ అనేది 'దేవర'లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త రిచ్‌గా చూపించారు.సినిమాలోని సీన్స్‌తో పాటు ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నటీనటులెవరు అనే విషయం పక్కనబెడితే తెరపై పాత్రల స్వభావం మాత్రమే కనిపిస్తుంది. మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండరు. కానీ సినిమా మొదలైన కాసేపటికే లీనమైపోతాం. ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే 'కొండల్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
మాటల పాట.. కొండల్ ఆట
పోరాటాల పురిటిగడ్డ మన నల్లగొండ ..ఎంతో మంది కవులు, కళాకారులకు పుట్టినిళ్లుగా తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసింది. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని కలిగించిన ఘనత కళాకారులదే. గజ్జెకట్టి తెలంగాణ ధూంధాంతో హోరెత్తించి ప్రజా చైతన్యంతో పాలకులను మేలుకొల్పింది కళాకారులే. రేయింబవళ్లు పాటే ప్రాణంగా బతికిన ముద్దు బిడ్డ ఈ నాగిళ్ల కొండల్. సాక్షి, మిర్యాలగూడ టౌన్ : నిరుపేద కుటుంబంలో నాగిళ్ల కొండలు జన్మించాడు. చిన్నప్పటి నుంచి పల్లె పాటలు.. జానపదాలు అంటే.. ఆ యువకుడికి ప్రాణం. తన మాటలే పాటలుగా వినిపిస్తాయి. ‘పల్లెకు వందనం.. కన్నతల్లికి వందనం... పాట నేర్పిన పల్లెకు వందనం...’ అంటూ పుట్టిన పల్లెకు ..కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. రచయితగా.. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలోని అన్ని జిల్లాల్లో సుమారు 800 వరకు ప్రదర్శనలు ఇచ్చాడు. కాలుకు గజ్జకట్టి భూజాన గొంగడి వేసుకొని రాత్రనక, పగలనక తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలు, వెనుకబాటు తనం, తెలంగాణ యాస, భాష, గోసలపై తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపాడు త్రిపురారం మండలంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల అన్నరావు క్యాంపుకు చెందిన నాగిళ్ల బక్కయ్య–బుచ్చమ్మల దంపతులు నిరుపేద దళిత కుటుంబానికి చెందిన వారు. వీరికి రెండవ సంతానం అయిన నాగిళ్ల కొండలుకు చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో పాటలను పాడుతూ ఆకట్టుకునే వాడు. నల్లగొండతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ‘తల్లి నీ ఒడినిండా .. త్యాగాల మూట... పల్లె నీ బతుకంతా...ఉద్యమాల బాట...గాయాలు గుండెనిండా..ఎత్తేను పోరాట జెండా...అలుపన్నది ఎరుగకుండా కదిలేను నా.. నల్లగొండా...’ అనే జిల్లా చరిత్ర పాటలను వరంగల్‌లో జరిగిన ధూం ధాంలో పాడితే ప్రజలు జేజేలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగక కాలుకు గజ్జెకట్టి..భుజాన గొంగడి వేసి తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ వెనుకబాటుపై గళమెత్తి దగాపడ్డా తెలంగాణపై దండు కదలాలని తమ వంతుగా పాత్రను పోషించి.. పాటమ్మ..నాకు ప్రాణా మా.. అంటూ ఉర్రూతలూగించాడు. ఇతను పాటగాడే కా దు.. రాతగాడు కూడా... ప్రజల మాటలను పాట లు గా అల్లి.. పాడే ప్రజా కళా కారుడు నిరుపేద కుటుం బం నుంచి..వచ్చి... పాటే తన ప్రాణంగా.. నేటి వరకు ఎన్నో గీతాలు, పాటలను రచించి పాడాడు. చిన్నతనం నుంచే పాటలు పాడటంతో పాటు పల్లెల్లో దండోరాను మోగించేవాడు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై పల్లెల్లో ప్రజలకు పాటలను వినిపించేవాడు. 800 వరకు ప్రదర్శనలు ప్రజా యుద్ధనౌక గద్దర్ పాడిన పాటలకు అడుగులు కలిపినా... విమలక్క ధూంధాం జాతరలో దుముకులాడిన... ఫైలం సంతోష్, గిద్దె రామనర్సయ్య పాటలతో గొంతు కలిపినా...అన్నీ తెలంగాణ జన సైన్యం కోసమే. ప్రజా కళాకారుడిగా గత 10 ఏళ్లుగా సుమారు 800 వరకు ప్రదర్శనలను ఇచ్చి ప్రజలందరి మన్ననలను పొందాడు. తెలం గాణ ఉద్యమంలో విస్తృతంగా పనిచేసిన ఇతను పలు జిల్లాలతో పాటు ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రముఖ పట్ట ణాల్లో తన ఆట పాటలను ప్రదర్శించారు. మిత్ర రాసే పాటలను మితిమీరంగా అభిమానించే కొండలు విమలక్క ఆటా పాటలకు జతకట్టాడు. ఉద్యమాలకు పుట్టినిళ్లు నల్లగొండ వెలుగొందుతున్న నాగిళ్ల కొండలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాంçస్కృతిక కళా వేదిక రాష్ట్ర కన్వీనర్‌గా పనిచేశాడు. కలంనుంచి జాలు వారిన పాటల ఒరవడి తన కలం ..గళం నుంచి వెలువడిన పాటలు పేదోళ్ల బతుకు చిద్రంను చూపించేవి. పేదోళ్ల వెతలపై అతని కలం కవాతు చేసేది. ‘పల్లె యాడికొస్తుందంటూ’ చిన్నతనంలో తన గ్రామంలో పద్దులు, ఉయ్యాల పాటలను పాడి అమ్మలక్కలను. బాగోతం చెప్పే పెద్దమనుషులను, సారా తాగి ఊగోళ్ల తంతును నమ్మకాలు, జానపదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలతో పాటు అనేక అంశాలపై పాటలను రాసి ఆల్బం తయారు చేశాడు. తెలంగాణ సాంస్కృతిక సారధిగా పని చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పతకాలపై పాటలను రాసి బంగారు తెలంగాణ కోసం పల్లెపల్లెల్లో ప్రజలను చైతన్యం చేశాడు. ఈ సంక్షేమ పథకాలపై ఆల్భంను తయారు చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతే కాకుండా హరితహారం వంటి కార్యక్రమాలకు కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసలు పొందాడు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందాం ప్రస్తుతం కనుమరుగు అవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాల్సి ఉంది. నాడు జనపదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. కానీ నేటి కాలానికి అనుగుణంగా సంస్కృతి, సంప్రదాయాలను కూడా మారుస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైన ఉంది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన ప్రతి కళాకారుడిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. – నాగిళ్ల కొండల్ -
అప్పు తీర్చలేదని..
నరసరావుపేట : రాష్ట్రంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తీసుకున్న అప్పు చెల్లించక పోతే ఏమీ చేసేందుకైనా వెనుకాడటం లేదు. తాజాగా అప్పు చెల్లించలేదని వడ్డీప్యాపారి ఓ వ్యక్తిని నిర్బంధించాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి బాదితుడిని విడిపించి వడ్డీ వ్యాపారిని అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ మండలం చెల్లారివారిపాళెంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు... కుంభా వెంకట్రావు అనే వ్యక్తి ముష్టిపల్లి కొండలు అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేదన్న ఆగ్రహంతో సదరు వడ్డీవ్యాపారి వెంకట్రావును మంగళవారం ఉదయం ఇంటికి పిలిపించి గదిలో నిర్భంధించాడు. విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, తల్లి బుధవారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. స్పందించిన పోలీసులు వ్యాపారి ఇంట్లో బంధీగా ఉన్న వెంకట్రావును విడిపించి కొండలును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.