సమాధానాలేవీ.. ? | MLAs demands for CID enquiry | Sakshi
Sakshi News home page

సమాధానాలేవీ.. ?

Jan 21 2014 4:35 AM | Updated on Nov 6 2018 7:53 PM

ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చోరీ కేసులో అనుమానితునిగా భావిస్తున్న చైర్మన్ కారు డ్రైవర్ సాన చంద్రయ్య(27) ఆదివారం రాత్రి పోలీసుల అదుపులో ఉండగానే మరణించాడు.

కోరుట్ల ఠాణాలో యువకుడి మృతి పోలీసు అధికారుల మెడకు చుట్టుకుంది. ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చోరీ కేసులో అనుమానితునిగా భావిస్తున్న చైర్మన్ కారు డ్రైవర్ సాన చంద్రయ్య(27) ఆదివారం రాత్రి పోలీసుల అదుపులో ఉండగానే మరణించాడు. ఇది లాకప్ డెతా? చిత్రహింసలకు తట్టుకోలేక ఠాణాపై నుంచి దూకి చనిపోయాడా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతడిని నెట్టేశారా? అనే అనుమానాలు చుట్టుముట్టడంతో ఈ సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది.

ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘోరాన్ని ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌గా వెలుగులోకి తెచ్చింది. అప్పటిదాకా గోప్యంగా ఉంచిన పోలీసు అధికారులు సోమవారం ఉదయాన్నే చంద్రయ్య మృతిచెందిన విషయాన్ని ధ్రువీకరించారు. ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు... కొట్టి చంపినట్లుగా మృతుని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగటం.. సీఐడీతో విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయటంతో చంద్రయ్య మృతి పోలీసు విభాగంలో కలకలం రేపింది. ఈ ఘటనలో ఆద్యంతం పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సందేహాస్పదంగా మిగిలిన ప్రశ్నలెన్నో...?
 
 సమాధానాలేవీ.. ?
   గత నెల 21న ధర్మపురిపీఏసీఎస్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ జరిగింది. పోలీసు కథనం ప్రకారం.. చంద్రయ్య సహా ముగ్గురు అనుమానితులను శనివారం అదుపులోనికి తీసుకున్నారు. వీరిని ధర్మపురిలో, సమీపంలో ఉన్న జగిత్యాలలో విచారించకుండా కోరుట్లకు ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది?
   బ్యాంకులో కిలోన్నర బంగారం చోరీ జరిగితే... రెండున్నర తులాల బంగారం చంద్రయ్య నుంచి రికవరీ చేసినట్లు ఎస్పీ ప్రకటించటం ఎలుకకు ఏనుగుకు పొంతన లేనంతగానే ఉంది. మరి మిగతా బంగారం ఎక్కడుంది? నిందితులందరూ దొరికారా? బంగారం ఆచూకీ పోలీసులకు తెలిసిపోయిందా?
   ఆదివారం రాత్రి 9.45 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసుల కథనం. మరి కుటుంబీకులకు ఎందుకు సమాచారం అందించలేదు. మార్గమధ్యంలో జగిత్యాలలో ఆసుపత్రి సమాధానాలేవీ.. ? ఉండగా.. అర్ధరాత్రి దాటాకా కరీంనగర్ ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది.

   విచారణ జరుపుతుంటే బిల్డింగ్‌పైకి పరిగెత్తి... రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ ప్రకటించారు. అత్యంత రహస్యంగా విచారణ చేసేందుకు అనుమానితులను.. ఎవరికి తెలియకుండా కోరుట్ల స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు బహిరంగంగా విచారణ చేశారా? పోలీసుల కళ్లుగప్పి నిందితుడు పరుగు తీశాడా? అధికారుల నిర్లక్ష్యమేమీ లేదా?  నిందితులను విచారణకు తీసుకువస్తే చాలా జాగ్రత్తగా కాపలా కాస్తారు.

ఒంటిపై బట్టలు, చైన్లు ఏమీ లేకుండా తొలగించి చివరకు టాయ్‌లెట్‌కు వెళ్లినా పోలీసులు అనుసరిస్తారు. కానీ.. ఇంటరాగేషన్‌లో పాటించాల్సిన కనీస జాగ్రత్తలను విస్మరించారా?
   సాధారణంగా బిల్డింగ్‌పై నుంచి దూకితే కాళ్లు చేతులు విరుగుతాయి. రక్తపు గాయాలుంటాయి. కానీ.. చంద్రయ్య తలకు బలమైన రక్తమైన గాయంతో పాటు చేతులు, అరికాళ్లపై కమిలిపోయిన గాయాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement