
ఆనాటి రాక్షస పాలన మళ్లీ గుర్తుకొస్తోంది
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను మర్చిపోయిందని పుత్తూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీలను మర్చిపోయిందని చిత్తూరు జిల్లా పుంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు మూడు నెలల పాలన ఇంతకుముందు ఆయన తొమ్మిదేళ్ల పాటు సాగించిన రాక్షస పాలనను గుర్తుకు తెస్తోందని ఆయన మండిపడ్డారు.
ఉన్న పింఛన్లను తొలగించడమే జన్మభూమి కార్యక్రమంలా మారిందని, జన్మభూమి- మాఊరు కార్యక్రమాన్ని ప్రజలే అడ్డుకుంటున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. అందుకే స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా జన్మభూమిని ఆరు నెలల పాటు వాయిదా వేస్తే మంచిదని తమ అధినేతను కోరుతున్నట్లు ఆయన అన్నారు.