బాధితులకు అండగా ఉంటాం: మంత్రులు | Ministers High Level Meeting On Visakha Gas Leakage Incident | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ లీకేజీ ఘటనపై అత్యున్నత స్థాయి  సమావేశం

May 7 2020 9:16 PM | Updated on May 7 2020 9:26 PM

Ministers High Level Meeting On Visakha Gas Leakage Incident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధితులకు అండగా ఉంటామని మంత్రులు తెలిపారు. విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై వారి ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సీఎస్‌ నీలంసాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పించి.. అండగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని మంత్రులు తెలిపారు. గ్యాస్‌ లీకేజీ బాధితులకు మంచి ఆహారం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
(ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు)

లీకేజీ గ్రామాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని  తెలిపారు. బాధితులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా బాసటగా ఉంటుంది. గ్యాస్ లీకేజీ ఘటన పై అధ్యయన కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని సీఎం తెలిపారు. జంతు నష్టం పై కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని’’ ఆళ్ల నాని వెల్లడించారు.
(నాడు డిమాండ్‌ చేశారు: నేడు ఆచరించారు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement