
లేఖ ఇచ్చి ఎందుకు సహకరించారు?
ప్రజలను మభ్య పెట్టేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకా శేషుబాబు విమర్శించారు.
పాలకొల్లు: ప్రజలను మభ్య పెట్టేందుకే ఏపీ సీఎం చంద్రబాబు నవనిర్మాణ దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేకా శేషుబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపడితే ప్రజలు హర్షించేవారని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం శేషుబాబు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి వల్ల విడిపోయిందో ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. రాజకీయాల్లో తాను సీనియర్ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చి ఎందుకు సహకరించారని ప్రశ్నించారు.