సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌కు ఫస్ట్ ర్యాంక్ | Masterminds first rank in CMA results | Sakshi
Sakshi News home page

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌కు ఫస్ట్ ర్యాంక్

Jan 25 2015 1:05 AM | Updated on Sep 2 2017 8:12 PM

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌కు ఫస్ట్ ర్యాంక్

సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్‌కు ఫస్ట్ ర్యాంక్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఫైనల్ పరీక్ష ఫలితాల్లో..

గుంటూరు: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఫైనల్ పరీక్ష ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ సీఏ విద్యాసంస్థ జాతీయస్థాయిలో మంచి ఫలితాలు సాధించిందని సంస్థ డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు. బ్రాడీపేటలోని మాస్టర్‌మైండ్స్ కార్యాల యంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఏ, కామర్స్ విద్యారంగ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ జాతీయస్థాయి లో అత్యధికంగా 24వ సారి ప్రథమ ర్యాంకును సొంతం చేసుకుని రికార్డు ఫలితాలు సాధించినట్లు వివరించారు.
 
 సీఎంఏ(ఐసీడబ్ల్యూఏ) ఫైనల్ ఫలితాలను కోల్‌కతాలోని ఐసీఏఐ సంస్థ ఈ నెల 20న ప్రకటించగా తమ విద్యార్థిని జాస్తి తుల్జా భవాని బాలి కల విభాగంలో అఖిల భారత స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. మాస్టర్‌మైండ్స్‌లో ఇంటర్మీడియెట్ విద్యను అభ్యసించిన తుల్జా భవాని ఎంఈసీలో 966 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిందని వివరించారు. మార్చి 20న కోల్‌కతాలో జరిగే నేషనల్ స్టూడెంట్ కాన్వొకేషన్-2015లో ఐసీఏఐ సంస్థ తుల్జా భవానికి ‘వజీర్ దేబి పూరి మెమోరియల్ బంగారు పతకం’ బహూకరించనుందని తెలిపారు.

Advertisement
Advertisement