నందిగామలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టొద్దు | mandali buddha prasad meets ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

నందిగామలో వైఎస్ఆర్సీపీని నిలబెట్టొద్దు

Aug 22 2014 9:59 AM | Updated on Aug 14 2018 2:50 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు.

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కలిశారు. నందిగామ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని నిలబెట్టవద్దని ఆయన ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కోరారు. అయితే ఈ అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ జగన్ తెలిపారు.

కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఎన్నికల కమిషన్ ఆ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య పోటీ చేయనున్నారు. ఆమెను అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం ఎంపిక చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement