ఆదరించండి..అండగా ఉంటాం

 Magunta, Balineni Election Campaign In Allur - Sakshi

ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు మాగుంట, బాలినేని 

ఆనవాయితీ ప్రకారం అల్లూరు నుంచి ఎన్నికల ప్రచారం

అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు

సాక్షి, అల్లూరు (కొత్తపట్నం): అల్లూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం 30 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిలు అన్నారు. స్థానిక రాజీవ్‌ కళా మందిరంలో సోమవారం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ మండల అధ్యక్షుడు ఆళ్ల రవీంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా కృష్ణుడు మందిరంలో పూజలు చేశారు. అక్కడ నుంచి ర్యాలీతో ప్రచారం చేసుకుంటూ ఆనవాయితీ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నా అన్న సుబ్బరామిరెడ్డి 1990 నుంచి అల్లూరు గ్రామాన్ని ఎన్నికల ప్రచారానికి ఎన్నుకున్నారన్నారు.

అల్లూరు గ్రామ వాసులు ఆశీర్వదించడంతో మేము గెలుపుగా భావించేవాళ్లమని గుర్తు చేశారు. ఇప్పటికీ పదిసార్లు పోటీ చేస్తే అల్లూరు నుంచే ప్రచారానికి వచ్చి ప్రారంభించామన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రజల సాధక, బాధలు తెలుసుకొని నవరత్నాల పథకాలను రూపొందించారన్నారు. అల్లూరులో నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్‌ఎస్‌పీ కాలువ ద్వారా నీటి అల్లూరు చెరువుకు తీసుకువస్తామన్నారు.  బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందితే ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదన్నారు. సాగర్‌లో నీరు ఉన్నా అల్లూరు చెరువుకు ఎందుకు రాలేదని, రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు చెరువుకు నీరు వచ్చేయన్నారు. అల్లూరు చెరువుకు నీరు వచ్చేలా కృషి చేస్తామన్నారు. శింగరాజు రాంబాబు మాట్లాడుతూ నారా చంద్రబాబునాయుడు చేసే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు మోసపోవద్దన్నారు. దామచర్ల జనార్దన్‌రావు కమిషన్లకు, పర్శంటేజీలకు ప్రాధాన్యం ఇచ్చేవాడని, బాలినేని ఎప్పుడూ ప్రజలకు సేవలు చేసేవారని గుర్తు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి మీద నాన్‌బెయిల్‌బుల్‌ కేసుపెట్టడం ఎంత అన్యాయమని మండిపడ్డారు.

సీనియర్‌ నాయకుడు వీరేపల్లి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మండలంలో సంక్షేమ పథకాల పేరుతో కోట్లు దండుకున్నారన్నారు. కార్యక్రమంలో బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుప్పం ప్రసాద్, అయినబత్తిన ఘనశ్యాం, శింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత, గొర్రెపాటి శ్రీనివాసులు, రాజశేఖర్,  నానిరెడ్డి పేరారెడ్డి, యూత్‌ అధ్యక్షుడు మెట్టా రవికుమార్‌రెడ్డి, వీరేపల్లి రామచంద్రారెడ్డి, దాచూరి గోపాల్‌రెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, ఎంపీటీసీలు పాలపర్తి నాగేంద్రం, మొలకా బుజ్జమ్మ, వాయల మోహన్‌రావు, స్వర్ణ శివారెడ్డి, మిట్నసల భారతి తదితరులు పాల్గోన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top