అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద బుధవారం రాత్రి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు వద్ద బుధవారం రాత్రి విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తూరు వద్ద ఓ లారీ బియ్యం లోడుతో అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ రమేష్‌కు సమాచారం
అందించారు. ఆయన వెంటనే ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, సంగమేశ్వరరావును అప్రమత్తం చేయడంతో కొత్తూరుకు చేరుకున్నారు. లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని రూ.4 లక్షల విలువైన 400 బస్తాల బియ్యంను స్వాధీనం చేసుకున్నారు. లారీని ఎఫ్‌సీఐ గోదాముకు తరలించారు.