తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తన మంత్రివర్గంలో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై లొల్లి చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తన మంత్రివర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రాజకీయ అనైతికత, ప్రజాస్వా మ్యం అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్, గవర్నర్ సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోక పోవడం దారుణమన్నారు.