
మృతుడు శంకరరావు
దత్తిరాజేరు : బొండపల్లి మండలం బోడసింగుపేట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి బోడిసింగుపేటకు చెందిన న్యాయవాది శంకరరావు (46) కుమారుడు ప్రమోద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గజపతినగరం నుంచి బోడసింగుపేట వస్తుండగా, విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తున్న ఆటో ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శంకరరావు అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 వాహనంలో కుమారుడ్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బొండపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి భార్య రమాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది.