విజయవాడలో మరో భూకబ్జా

Land Kabza In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: నగరంలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. కబేళా సమీపంలోని కొండ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ దళితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ స్థలల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ సీపీ దగ్గర వాపోయారు.

అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల సహకారంతో తమ భూమిని కాజేయాడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని తమ స్థలం వద్దకు రానీయకుండా కొంత మంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొనారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ స్థలాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top