తెలంగాణ శాసనమండలికి లగడపాటి

 lagadapati rajagopal visits telangana legislative council - Sakshi

సాక్షి, హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం తెలంగాణ శాసనమండలి వచ్చారు. తన కొడుకు పెళ్లి త్వరలో జరుగుతున్నందున పలువురు ఎమ్మెల్సీలకు పెళ్లికి ఆహ్వానించేందకు ఆయన మండలికి చేరారు. అక్కడ పలువురు ఎమ్మెల్సీలను కలిసి శుభలేఖలు అందజేశారు.

కేసీఆర్‌తో భేటీ
కాగా లగడపాటి బుధవారమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ శుభలేఖను అందించారు. కేసీఆర్‌ కూడా లగడపాటిని సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌, లగడపాటి కలుసుకోవడం ఇదే తొలిసారి. ఉద్యమ నేపధ్యంలో ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌ పెప్పర్‌ స్ప్రే కొట్టి కలకలం రేపిన లగబపాటి రాష్ట్ర విభనను వ్యతిరేకించారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top