స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి | Lagadapati Rajagopal to Meet with Speaker Meira Kumar on his Resignation | Sakshi
Sakshi News home page

స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి

Oct 21 2013 9:59 AM | Updated on Sep 1 2017 11:50 PM

స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి

స్పీకర్ మీరాకుమార్ను కలవనున్న లగడపాటి

విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు.

న్యూఢిల్లీ : విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు లోక్సభ స్పీకర్ మీరాకుమార్ను కలవనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన తన రాజీనామా లేఖను మరోసారి స్పీకర్ను సమర్పించనున్నారు. ఇప్పటికే స్పీకర్ ...లగడపాటితో పాటు మరో 12మంది ఎంపీలు రాజీనామాలు తిరస్కరించిన విషయం తెలిసిందే.

భావోద్వేగాల వల్ల రాజీనామా చేశామనే కారణంతో స్పీకర్‌ తమ రాజీనామాలను తిరస్కరించారని  లగడపాటి రాజగోపాల్‌ పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందాక రాష్ట్ర విభజనకు కారకులైన వారి జాతకాలు బయటపెడతానని గతంలో హెచ్చరించారు. ఇక రెండు నెలల క్రితం తాను చేసిన రాజీనామాను ఆమోదించేలా ఆదేశించాలంటూ  లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement