రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు | kiran kumar reddy make a decision on cabinet change | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు

Dec 31 2013 9:54 PM | Updated on Jul 29 2019 5:31 PM

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకూ శాసన సభా వ్యవహారాల శాఖ బాధ్యతలు చూస్తున్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించారు. ఈ స్థానంను మంత్రి శైలజా నాథ్ కు అప్పగించారు. తాజాగా ఇద్దరు మంత్రుల శాఖలను మార్చుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ వ్యవహారాల శాఖ నుంచి శ్రీధర్‌బాబును తప్పించిన కిరణ్‌ ఆ శాఖను శైలజానాథ్‌కు కేటాయించారు. శ్రీధర్ బాబుకు వాణిజ్య పన్నుల శాఖను అప్పగించుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో కేబినెట్ లోని అకస్మిక మార్పులపై విమర్శలకు తావిస్తోంది. సమైక్య నినాదం వినిపిస్తున్న శైలజా నాథ్ కు శాసన సభా వ్యవహారాల శాఖను అప్పగించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం హస్తం ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

రాష్ట్ర అసెంబ్లీలో సమైక్య అంశాన్ని పట్టించుకోని కిరణ్ కుమార్ రెడ్డి .. రాజకీయ గేమ్ లోని భాగంగానే కేబినెట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే  సీఎం సరికొత్త ఎత్తుగడను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement