జీవో 465 రద్దు చేయాలని సమ్మె | junior doctors darna for GO 465 canceled | Sakshi
Sakshi News home page

జీవో 465 రద్దు చేయాలని సమ్మె

Nov 4 2017 11:00 AM | Updated on Nov 4 2017 11:00 AM

junior doctors darna for GO 465 canceled  - Sakshi

ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న జూడాలు, కలక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న వైద్యులు, మెడికోలు

గుంటూరు మెడికల్‌: ఆర్‌ఎంపీ, పీంఎంపీలకు ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ విడుదల చేసిన జీవో 465ను తక్షణం రద్దు చేయాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ), ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (అప్‌జూడ్‌) డిమాండ్‌ చేశాయి. శుక్రవారం గుంటూరులో రెండు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. గుంటూరు జీజీహెచ్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకూ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. ఫ్లకార్డులు చేతపట్టుకుని, నల్లరిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. 

అనంతరం కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో ఏవో ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ నాగళ్ల కిషోర్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడు డాక్టర్‌ జయధీర్‌బాబు, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్‌ ఆవుల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement