రాయల తెలంగాణకు కావాలని కోరతాం: జేసీ | J.C. Diwakar Reddy welcomes Intelligence Bureau Phone Call to TRS Leaders on Rayala telangana | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణకు కావాలని కోరతాం: జేసీ

Nov 25 2013 2:44 PM | Updated on Sep 2 2017 12:58 AM

రాయల తెలంగాణకు కావాలని కోరతాం: జేసీ

రాయల తెలంగాణకు కావాలని కోరతాం: జేసీ

రాయల తెలంగాణపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అభిప్రాయాలు తెలుసుకోవడాన్ని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వాగతించారు.

హైదరాబాద్ :  రాయల తెలంగాణపై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అభిప్రాయాలు తెలుసుకోవడాన్ని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్వాగతించారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు తనతో మాట్లాడినప్పుడు రాయల తెలంగాణకు అంగీకరిస్తున్నామని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

అయితే అదే విషయాన్ని వారు బయటకు చెప్పటం లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగినప్పుడు రాయల తెలంగాణ కావాలని కోరతామని జేసీ తెలిపారు. కాగా తెలంగాణ ముసాయిదా బిల్లు, విభజన అంశంపై జీవోఎం నివేదిక కేంద్ర మంత్రిమండలి ముందుకు రానున్న నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు  రాజకీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి పలు అంశాలపై ఆరా తీసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement