రంగురాళ్ల తవ్వకాలపై ఆరా | Investigations on Colour Stone Hunting in Visakhapatnam | Sakshi
Sakshi News home page

రంగురాళ్ల తవ్వకాలపై ఆరా

Sep 9 2019 12:17 PM | Updated on Sep 15 2019 11:26 AM

Investigations on Colour Stone Hunting in Visakhapatnam - Sakshi

గ్రామంలో విచారణ చేçస్తున్న ఎస్‌ఐ నారాయణరావు

విశాఖపట్నం, గొలుగొండ(నర్సీపట్నం):సాలికమల్లవరం రంగురాళ్ల క్వారీలో  తవ్వకాలు జరిగినట్టు వచ్చిన సమాచారంతో ఎస్‌ఐ నారాయణరావు, వీఆర్‌వో పడాల్‌ క్వారీ ప్రాంతాన్ని ఆదివారం పరిశీ లించారు. గ్రామ సమీపంలో జిరాయితీ భూమి లో గతంలో రంగురాళ్లు బయటపడ్డాయి.ఆదివారం కొంతమంది  ఈ క్వారీలో మట్టిని తరలించి, సమీప తాండవ నది సమీపంలో నీటితో రంగురాళ్లు కడిగినట్టు వచ్చిన సమాచారంతో ఆ ప్రాంతాలను పరిశీలించారు. తాండవ నది పరిసరాలు అన్నింటిని పరిశీలించిన ఎస్‌ఐ, వీఆర్‌వోలు, సాలికమల్లవరంలో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు.  అయితే ఇక్కడ తవ్వకాలు జరగలేదని అధికారులు గుర్తించారు. ఈ విషయంపై వీఆర్‌వో పడాల్‌ను సంప్రదించగా జిరాయితీ భూమిలో రంగురాళ్లు తవ్వినట్టు వచ్చిన సమాచారంతో  తాండవ నది పరిసర ప్రాంతాలను పరిశీలించినట్టు చెప్పారు. ఎక్కడా తవ్వకాలు జరగలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement