రమాదేవి కథ సుఖాంతం.... | In-laws shut door: Happy End to 'Ramadevi' Case | Sakshi
Sakshi News home page

రమాదేవి కథ సుఖాంతం....

Nov 8 2013 8:55 AM | Updated on Sep 2 2017 12:25 AM

రమాదేవి కథ సుఖాంతం....

రమాదేవి కథ సుఖాంతం....

అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది.

హైదరాబాద్ : వారసుడు లేడనే నెపంతో  అత్తామామ, భర్త వేధిస్తున్నారని ముగ్గురు కూతుళ్లతో న్యాయపోరాటం చేసిన రమాదేవి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. దిల్సుఖ్నగర్ వికాస్ నగర్లో అత్తింటి ముందు ఆమె ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి, ఐద్వా మహిళ సంఘాలు ఆమెకు మద్దతు తెలిపాయి.

మహిళ సంఘాలు బాధితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లగా... పోలీసులు రమాదేవి భర్త సంతోష్, మామ ప్రకాశ్ రావు, అత్త నిర్మాలదేవిలను రప్పించారు. మహిళ సీఐ మధులత ఇరువురి అంగీకారం మేరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టకేలకు ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుని పోలీసుల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. మగ సంతానం లేదనే నెపంతో వేధిస్తున్నట్లు రమాదేవి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement