కాంగ్రెస్ పార్టీలో హెవీ వెయిట్స్‌కు ఇప్పుడొక సమస్య వచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో హెవీ వెయిట్స్‌కు ఇప్పుడొక సమస్య వచ్చింది. పార్టీలో యువతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెబుతున్న నేపథ్యంలో తెలంగాణ ఏర్పడితే సీఎం కావొచ్చని ఆశిస్తున్న నేతలు.. యువకులుగా కనిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. తెలంగాణ విషయంలో పార్టీ అగ్ర నేతలను పలుసార్లు కలిసి.. సీఎం రేసులో తాను కూడా ఉన్నానని పదేపదే చెబుతున్న ఒక నాయకుడైతే.. గత కొద్ది రోజులుగా రోజూ వ్యాయామం కూడా మొదలుపెట్టారట.
ఉత్తరాది స్టయిల్లో కొందరు ఖద్దరు చొక్కాపై కోటును ధరిస్తూ రాహుల్‌ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటే.. మరో నాయకుడు బరువు తగ్గించుకోవడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే కాకుండా రోజూ వ్యాయామం చేస్తున్నారు. బరువు తగ్గి యువకుడిలా హుషారుగా కనిపించడానికి ఎంతగానో శ్రమపడుతున్నారట. ఏకంగా పది కిలోలు తగ్గారట. తెలంగాణ వచ్చేనాటికి యువ నేతలతో పరుగులు తీయడానికి సిద్ధమవుతున్నారట!