మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలు | GV Harsha Kumar Sentenced 6 months | Sakshi
Sakshi News home page

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలు

Jun 19 2015 8:35 AM | Updated on Sep 3 2017 4:01 AM

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలు

మాజీ ఎంపీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలు

మలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. కిశోర్‌బాబు గురువారం తీర్పు చెప్పారు.

రాజమండ్రి లీగల్: విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిపై దౌర్జన్యం చేసిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రాజమండ్రి మూడో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆర్. కిశోర్‌బాబు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2007 ఫిబ్రవరి 25న రాజమండ్రి మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో మాలమహానాడు అధ్యక్షులు కారెం శివాజీ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నందున 144 సెక్షన్ విధించారు.

రాత్రి 10 గంటల సమయంలో కొందరు వ్యక్తులు గుమిగూడి ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న అప్పటి ఎంపీ హర్షకుమార్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సత్యనారాయణపై దౌర్జన్యంగా ప్రవర్తించి, అదుపులో ఉన్న వ్యక్తులను తీసుకుపోయూరు. ఏఎస్ఐ ఫిర్యాదుతో ఎస్‌ఐ జి. మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మేజిస్ట్రేట్ పై శిక్షను విధించారు. అనంతరం హర్షకుమార్‌ను అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలయ్యూరు. కాగా జిల్లా కోర్టుకు అప్పీలు చేసుకునేందుకు 30 రోజులు గడువిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement