‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’ | gv harsha kumar praises mudragada padmanabham | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’

Jul 23 2017 7:47 PM | Updated on Jul 30 2018 6:25 PM

‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’ - Sakshi

‘చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలి’

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మచ్చలేని నాయకుడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ప్రశంసించారు.

విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మచ్చలేని నాయకుడని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ముద్రగడ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపులు బుద్ది చెప్పాలని కోరారు. కాపులపై అన్యాయంగా పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

కాపులు ఉభయగోదావరి జిల్లాల్లో సమావేశాలు పెట్టుకొనే అవకాశం లేకుండా చేస్తున్నారని, ఏపీలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సాయంతో చంద్రబాబు పాలన చేస్తున్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాపులు అడుగుతున్నారని గుర్తు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement