గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహణకు కసరత్తు | Grup2 screening exercise to test management | Sakshi
Sakshi News home page

గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహణకు కసరత్తు

Published Thu, Dec 22 2016 2:16 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహణకు కసరత్తు - Sakshi

గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహణకు కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతనెల 8న జారీచేసిన గ్రూప్‌2 నోటిఫికేషన్‌కు అత్యధిక సంఖ్యలో 6.55 లక్షల మంది దరఖాస్తు చేయడంతో స్క్రీనింగ్‌ టెస్టు

పరీక్షా కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్లకు ఏపీపీఎస్సీ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గతనెల 8న జారీచేసిన గ్రూప్‌2 నోటిఫికేషన్‌కు అత్యధిక సంఖ్యలో 6.55 లక్షల మంది దరఖాస్తు చేయడంతో స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహణపై కమిషన్‌ అధికారులు ముందునుంచే ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరీక్షలకు అనువైన పరీక్ష కేంద్రాలను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాశారు.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల సంఖ్యను అనుసరించి పరీక్షకు వసతి ఏర్పాట్లు చేయించాలని సూచించారు. కాగా, 150 మార్కులకు నిర్వహించనున్న ఈ స్క్రీనింగ్‌ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్‌ వివరాలను ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. పరీక్ష మూడు కేటగిరీల్లో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement