వ్యవసాయంలో సమూల సంస్కరణలు | Growth reforms in agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో సమూల సంస్కరణలు

Jun 17 2017 1:39 AM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవసాయంలో సమూల సంస్కరణలు - Sakshi

వ్యవసాయంలో సమూల సంస్కరణలు

వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

- రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వెల్లడి
- ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వద్దు
సర్టిఫికెట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ ఆధారంగా రుణాలివ్వాలి
 
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో సమూల సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రూ. 1,66,806 కోట్లతో రూపొందించిన 2017–18 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎవరికి పడితే వారికి రుణాలు ఇవ్వద్దని, ఉద్పాదకత పెంచేవారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. పొలాల్లో పనులకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని, సర్టిఫికేషన్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ ఆధారంగా రుణాలు ఇవ్వాలని సూచించారు. రుణ అర్హత కార్డులతో వచ్చే రైతులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీలకు పంట రుణాలుగా రూ. 63,106 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కౌలు రైతులకు రూ. 6,311 కోట్లు రుణాలు ఇవ్వాలని తెలిపారు. కౌలు రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు.
 
కరువును ఎదుర్కొంటాం..: గతేడాది లోటు వర్షపాతమున్నా మంచి ఫలితాలు సాధించామన్నారు. వ్యవసాయ విధాన వ్యూహాలను మార్చి వేయాలన్న ధ్యేయంతో కొత్త పోకడలతో ముందుకు సాగుతున్నట్లు సీఎం తెలిపారు. రైతుకు రెట్టింపు ఆదాయం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement