
చీరాల అర్బన్: ‘రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్‌లో శరీరంలో ఒకవైపు నరాలు దెబ్బతిన్నాయి. ఒంగోలులో చూపిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. కూలి పనులకు వెళ్లే నాకు అంత స్థోమత లేదు. నడవలేని స్థితిలో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు’ అని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన జి.రవీంద్రబాబు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తన సమస్యను చెప్పుకున్నాడు.
ఇల్లు కాలిపోయినా పరిహారం అందలేదయ్యా!
పీసీపల్లి: ఆరు నెలల క్రితం ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని అద్దంకి మండలం మొండితోటవారిపాలెంకు చెందిన మొండితోట ఏసమ్మ ప్రజా సంకల్పయాత్రలో కుంకిపాడు గ్రామం వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించింది. తన భర్త చనిపోయాడని, పింఛన్ కూడా రావడంలేదని వాపోయింది. కూలిపనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నామని వాపోయింది.