
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
మంగళగిరి టౌన్/మైలవరం: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి పూలమార్కెట్ సెంటర్‌లో సంకా బాలాజీగుప్తా బ్రదర్స్, వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి మంగళవారం రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో ధనగణపతిగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
కాగా, కృష్ణా జిల్లా, మైలవరం 3వ వార్డులో శ్రీబాల గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రూ.లక్షతో కరెన్సీ గణపతిగా అలంకరించారు.