సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో ఉన్న వాహనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించడం పూర్తయింది.
సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ)లో ఉన్న వాహనాలను రెండు రాష్ట్రాలకు కేటాయించడం పూర్తయింది. ఇక్కడ ఉన్న మొత్తం వాహనాలను రెండు రాష్ట్రాలలోని జిల్లాల సంఖ్య ఆధారంగా 13: 10 నిష్పత్తిలో కేటాయించారు.
జీఏడీలో మొత్తం 48 కార్లు ఉండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు 27, తెలంగాణకు 21 చొప్పున కేటాయించారు. మొత్తం నాలుగు బైకులు మాత్రమే ఉండటంతో వాటిని రెండు రాష్ట్రాలకు తలో రెండు చొప్పున ఇచ్చేశారు.