తెలంగాణ ప్రకటించే క్రమంలో శాంతిభద్రతలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, జీహెచ్‌ఎంసీని గవర్నర్ పరిధిలోకి తీసుకువస్తారనే విషయమై త్వరలో టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని కలవనున్నదని, కేసీఆర్ కూడా లేఖ రాయనున్నారని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
గోదావరిఖని, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రకటించే క్రమంలో శాంతిభద్రతలు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు, జీహెచ్‌ఎంసీని గవర్నర్ పరిధిలోకి తీసుకువస్తారనే విషయమై త్వరలో టీఆర్‌ఎస్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని కలవనున్నదని, కేసీఆర్ కూడా లేఖ రాయనున్నారని ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు నా యిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం గోదావరిఖని లో జరిగిన హెచ్‌ఎంఎస్ 13వ మహాసభలకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా దేశంలో 28 రాష్ట్రాలతో కేం ద్రం ఎలా వ్యవహరిస్తుందో తెలంగాణ విషయంలో నూ అలాగే వ్యవహరించాలని ప్రధాని ని కోరనున్నట్లు చెప్పారు.
తెలంగాణ, సీమాంధ్రకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయ డం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన ఛండీగఢ్‌ను రాజధానిగా ఏర్పాటు చేశారని, కానీ ఆ పోలిక హైదరాబాద్‌కు సరికాదన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే కనీసంగా 200 కి.మీ. దూరం ఉంటుందని, అందుకే హైదరాబాద్‌ను యూటీ చేయాలని సీమాంధ్రులు ఒత్తి డి తీసుకువస్తున్నారని అన్నారు. ఒకవేళ ఈ ఆంక్షలు సడలించకపోతే మిగతా రాజకీయ పార్టీల మద్దతుతో పార్లమెంట్‌లో బిల్లును సవరించేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన ఖర్చులు చేస్తామంటే ఒప్పుకునేది లేదని, ఎక్కడి ప్రాజెక్టులకయ్యే ఖర్చును అక్కడే సమకూర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.