ఉరకలెత్తుతున్న వరద గోదారి | flood affects hundreds of villages in godavari districts | Sakshi
Sakshi News home page

ఉరకలెత్తుతున్న వరద గోదారి

Sep 10 2014 11:01 AM | Updated on Sep 2 2017 1:10 PM

గోదావరి వరద ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

గోదావరి వరద ఇంకా ఉధృతంగానే ఉంది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని 80 లంక గ్రామాలు ఇప్పటికీ వరద ముంపులోనే ఉన్నాయి. అయినవిల్లి మండలంలో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరంలో కాజ్‌వే దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 15.4 అడుగులుగా ఉంది. మొత్తం 175 గేట్లు ఎత్తేసి 15.40 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం వరకు లంక గ్రామాలు వరదనీటిలోనే ఉండే ప్రమాదం కనిపిస్తోంది. కె.ఏనుగుపల్లి ఏటిగట్లపై తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరిలో మొత్తం 10 వేల ఎకరాలలో పంట పొలాలు మునిగిపోయాయి. వెయ్యి హెక్టార్లలో ఉద్యానవన పంటలు మునిగాయి. తూర్పు ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 12 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆచంట, యలమంచిలి మండలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement