నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి | Father Raped 4-Year-Old Daughter in Nalgonda district | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి

Oct 31 2013 8:59 AM | Updated on Sep 2 2017 12:08 AM

కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ముందుగా చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డారని అంతా అనుమానించారు.

మునుగోడు  :  కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం బయటపడింది.

 

 మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందినకొండ యాదయ్య బతుకుదెరువు కోసం 20 రోజుల క్రితం మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి వచ్చి బొంతలు కుట్టుకుంటూ అక్కడే బస్‌షెల్టర్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన నాలుగు సంవత్సరాల పెద్ద కుమార్తెను గ్రామానికి రెండు కి.మీ దూరంలోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 

 

విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తిరిగి బస్‌షెల్టర్‌కు వచ్చి తన కూతురును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుక పోయారని గ్రామస్తులు, పోలీసులను నమ్మించాడు. తప్పిపోయిన తన కుమార్తెను వెతికి అప్పగించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకగా మంగళవారం ఒంటిగంటకు పత్తి చేలో బాలిక కనిపించింది.

 

ఆ బాలికకు తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్టు  వైద్యులు తెలపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రే లైంగికదాడి  చేసినట్లు అనుమానించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement