అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వేదిక వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సదస్సుకు రైతులను అనుమతించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు వేదిక వద్ద రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సదస్సుకు రైతులను అనుమతించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సదస్సుకు అనుమతించటం లేదంటూ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఈ సందర్భంగా రైతులు నిలదీశారు. అయితే జిల్లాల వారీగా ఎంపిక చేసిన రైతులను మాత్రమే సదస్సుకు ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.
బహుళ జాతి కంపెనీల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వ్యవసాయ సదస్సుకు రైతులను అనుమతించకపోవటం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాగా అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు సభ్యత్వ నమోదు రుసుమును ప్రభుత్వం రూ.5,000గా నిర్ణయించిన విషయం తెలిసిందే.