విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Nov 14 2015 3:06 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు విడిచాడు.

విద్యుదాఘాతంతో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కుంచెలవారిపాలెంలో శనివారం ఈ ఘటన జరిగింది.  వివరాల్లోకి వెళితే.. కౌలు రైతు అయిన డి.సుబ్బారెడ్డి (52)  రెండు ఎకరాల పొలంలో వరి సాగు చేస్తున్నాడు.

మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సుబ్బారెడ్డి... విద్యుత్ మోటారు ఆన్ చేయగా, వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement